గూగుల్ హోమ్ మినీ స్మార్ట్ స్పీకర్లు వచ్చేసాయి..ఎంజాయ్
ప్రస్తుతం మనందరం గూగుల్ గూట్లో ఉన్నాము..గూగుల్ లేనిదే తెల్లారదు..పొద్దుకూకదు అనే పరిస్దితి ఏర్పడిది. ఈ టెక్నాలజీ దిగ్గజంఅందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాడెక్టులు లాంచ్ చేస్తూ మరో గూటికి మనం ఎగరకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా గూగుల్ తన వాయిస్ యాక్టివేటెడ్ ‘హోమ్, హోమ్ మినీ’ స్పీకర్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
ఇందులో హోమ్ స్పీకర్ ధర రూ.9,999. హోమ్ మినీ ధర రూ.4,499. ఈ రెండు స్పీకర్లు గూగుల్ అసిస్టెంట్ సహాయంతో పని చేస్తాయి. ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్‌తో షోరూమ్స్‌తో పాటు మొత్తం 750 రిటైల్ స్టోర్లలో ఈ రెండు ఉత్పత్తులు లభిస్తాయి. దీంతో ఇప్పటికే భారత మార్కెట్లో ఉన్న అమెజాన్ ఇకో స్పీకర్లకు గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు. ఏంటి ఉపయోగం గూగుల్ విడుదల చేసిన స్మార్ట్ స్పీకర్ల ద్వారా యూజర్లు కేవలం మ్యూజిక్‌ను ప్లే చేసుకోవడమే కాదు, వాటితో తమ పనులను చక్కబెట్టుకోవటమే దీని స్పెషాలిటీ. వాయిస్ కమాండ్ల ద్వారా వాటికి ఆదేశాలు ఇస్తే అందుకు తగిన విధంగా స్పీకర్లు ఔట్‌పుట్‌ను ఇస్తూంటాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే గూగుల్ అసిస్టెంట్ ఈ స్పీకర్లలో ఉంటుంది. కనుక యూజర్లు ఓకే గూగుల్ అనే కమాండ్ ద్వారా వీటితో పనిచేయించుకోవచ్చు. మ్యూజిక్ ప్లే చేయడం, వార్తలు చదవడం, వాతావరణ విశేషాలు తెలుసుకోవడం, కాల్స్ చేయడం వంటి పనులను ఈ స్పీకర్లు చేస్తాయి. ఇక్కడ మీరు ఆ వీడియోని చూడవచ్చు.
